(నిర్మల్ జోర్దార్ ప్రతినిధి)
జిల్లా కేంద్రంలోని విస్డం స్మార్ట్ పాఠశాలకు చెందిన విద్యార్థులు బుధవారం పట్టణంలోని కొయ్య బొమ్మల తయారీ కేంద్రాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా కొయ్య బొమ్మల తయారీ విధానాన్ని,అక్కడ తయారు చేస్తున్న కళాకారుల నైపుణ్యాన్ని విద్యార్థులకు ఉపాధ్యాయులు వివరించారు.కళాకారులు తయారుచేసిన కొయ్య బొమ్మలను చూసి విద్యార్థులు ముగ్ధులయ్యారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి.సునీత, కరస్పాండెంట్ లక్ష్మి,పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు













Leave a Reply