భీమదేవరపల్లి జోర్దార్ విలేఖరి
భీమదేవరపల్లి మండల వనరుల కేంద్రంలో టీఎంఎఫ్ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు గణిత టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. విద్యార్థులలో పఠనాసక్తి, విషయ నైపుణ్యం, తార్కిక చింతన పెంపొందించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ టాలెంట్ టెస్టును మండల నోడల్ అధికారి శ్రీమతి సునీత రాణి ప్రారంభించి మాట్లాడుతూ.. విద్యార్థులు గణితాన్ని కష్టపడి కాకుండా ఇష్టపడి ప్రాక్టీస్ చేస్తే సులభంగా వస్తుంది అని తెలిపారు . ఈ టెస్టులు విద్యార్థులలో పరీక్ష భయాన్ని పోగొట్టి ఫైనల్ పరీక్షలో ఆత్మవిశ్వాసాన్ని నింపి మంచి ఫలితాన్ని సాధిస్తాయని పేర్కొన్నారు. ఈ పరీక్షలో మండలంలోని వివిధ పాఠశాలల నుండి ప్రతిభా వంతులైన సుమారు 40 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ టాలెంట్ టెస్ట్ లో పాల్గొన్న విద్యార్థులకు పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు ఇవ్వడంతో పాటు అరటిపండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో టిఎమ్ఎఫ్ మండల అధ్యక్షులు కె ఎల్లయ్య , ప్రధాన కార్యదర్శి రవీందర్ తో పాటు మండలంలోని అన్ని పాఠశాలల గణిత ఉపాధ్యాయులు పాల్గొన్నారు.













Leave a Reply