Advertisement

మెస్ సమస్యలను పట్టించుకోని కాకతీయ యూనివర్సిటీ వి.సి

ఓల్డ్ పెన్షన్ కోసం అడ్డ దారులు

కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి.

మెస్ సమస్యలను పట్టించుకోని యూనివర్సిటీ వి సి.

  • ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద శ్రీకాంత్.

(హనుమకొండ జోర్దార్ ప్రతినిధి):

యూనివర్సిటీ విద్యార్థుల మెస్ సమస్యలను పరిష్కరించి, నాణ్యమైన భోజనం అందించాలని హనుమకొండ జిల్లా ఎస్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి మంద శ్రీకాంత్ అన్నారు. శనివారం ఎస్ఎఫ్ఐ నాయకులు, కాకతీయ యూనివర్సిటీ కమిటీ అధ్యక్షుడు పురుషోత్తం, సాయి కిరణ్ ఆధ్వర్యంలో బాయ్స్ కామన్ మెస్ ను సందర్శించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విద్యార్థులకు నాణ్యమైన భోజనం యూనివర్సిటీ అధికారులు అందించడం లేదని, అన్నం పలుకు పలుకుగా, ముద్దగా ఉంటుందని, సగానికి సగం మంది విద్యార్థులు మెస్ లో తినకుండా డబ్బులు పెట్టి బయట తింటున్నారని, యూనివర్సిటీ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు.

పెరుగుతున్న మెస్ బిల్లులు….

ఉదయం పూట టిఫిన్ 9 గంటలకే అయిపోతుందనీ, మధ్యాహ్నం పూట కూరలు 1:30 వరకు, రాత్రిపూట 8:20 వరకు అన్ని అయిపోతున్నాయని అన్నారు. మెస్ బిల్లులు మాత్రం విపరీతంగా పెంచి యూనివర్సిటీ అధికారులు విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టడం లేదన్నారు, బాలికలకు సంబంధించిన కామన్ మెస్ లో కూడా అన్నం బాగుండడం లేదన్నారు, అన్నం తినేటప్పుడు భోజనంలో చిన్న చిన్న పురుగులు వస్తున్నాయన్నారు, ఇంత జరుగుతున్న యూనివర్సిటీ వి.సి, సంబంధిత అధికారులు ఎందుకు పట్టించుకోవడం ప్రశ్నించారు. ఇప్పటికైనా యూనివర్సిటీలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి వారికి న్యాన్యమైన భోజనం అందించాలని, మెను ప్రకారం టిఫిన్, లంచ్ టైంలో ఒక గంట సమయం ఎక్కువ విద్యార్థులకు సమయం పెంచాలని, లేదంటే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పరిపాలన భవనాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బొచ్చు కళ్యాణ్, జిల్లా కమిటీ సభ్యులు మడికొండ ప్రశాంత్, వినయ్, రాజ్ కుమార్, సందీప్, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *