
జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారదా
పలు గ్రామాల్లో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ను పరిశీలించిన కలెక్టర్
వరంగల్/నర్సంపేట/చెన్నారావుపేట/పర్వతగిరి: జోర్దార్ ప్రతినిధి:
సమగ్ర కుటుంబ సర్వే లో ప్రజలు భాగస్వాములై ఎన్యుమరేటర్లకు ప్రజలు సహకరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా కోరారు.సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా బుధవారం వరంగల్ జిల్లా గీసుకోండ మండలం ఉకల్ హావేలి గ్రామంలో, నర్సంపేట మండలం పాత మగ్ధుంపురం గ్రామములో, చెన్నారావుపేట మండలం అమినాబాద్ గ్రామంలో,పర్వతగిరి మండల కేంద్రంలో క్షేత్ర స్థాయిలో గృహాల గుర్తింపు,స్టీక్కరింగ్ ప్రక్రియను పరిశీలించి సమర్ధవంతంగా నిర్వహించుటకు గణకులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ సర్వే చేస్తున్న ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలు పక్కాగా నమోదు చేస్తున్నారా అని పరిశీలించారు.సర్వే అయిన ప్రతి ఇంటి గోడ పైన ఖచ్చితంగా స్టిక్కర్ అంటించాలని తెలిపారు.పత్రంలో ఉన్న ప్రశ్నలను సరిగ్గా నింపుతున్నారా లేదా అని ఫామ్ ను తీసుకొని కలెక్టర్ స్వయంగా పరిశీలించారు.ప్రతి ఇంటిలోని ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ ఓపికతో ప్రతి కుటుంబం నుండి స్పష్టత కలిగిన సమాధానాలను సేకరించాలని,సర్వే జరుగుతున్న సమయంలో కుటుంబ యజమానికి వారి వద్ద నుంచి సేకరించే సమాచారం గోప్యంగా ఉంచబడుతుందని,వారికి అర్థం అయ్యే విధంగా తెలియజేయాలని సూచించారు.నింపిన షెడ్యూల్ ఫారం జాగ్రత్తగా భద్రపరచాలని,ఈ
డేటా ఇతరులతో ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోకూడదని తెలిపారు. సామాజిక,ఆర్థిక,విద్య,ఉపాధి, రాజకీయ,కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే మొదటి దశలో నేటి నుండి ఈ నెల 8 వరకు ఇండ్లను సందర్శించి ఇండ్ల జాబితాను రూపొందించడం జరుగుతుందని, రెండవ దశలో ఈ నెల 9వతేదీ నుండి సర్వేచేసి ప్రతి కుటుంబం యొక్క సమగ్ర సమాచారాన్ని సమగ్ర సర్వే షెడ్యూల్ ద్వారా సేకరిస్తారని తెలిపారు.జిల్లాలోని 3 అర్బన్ (జిడబ్ల్యూ ఎంసీ,వర్ధన్నపేట, నర్సంపేట మునిసిపాలిటీ లు),11 మండలాల్లోని మొత్తం సుమారు 2 లక్షల 64 వేల ఇండ్ల సర్వే నిర్వహణకు 1841 ఎన్యూమరేషన్ బ్లాకులు ఏర్పాటు చేసి సర్వే నిర్వహణకు 1841 మంది ఎన్యూమరేటర్లును నియమించామని, రిజర్వ్ లో 184 మందిని అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. పర్యవేక్షణకు 184 మంది,రిజర్వడ్ లో 20 మందిని నియమించినట్లు తెలిపారు.ఎన్యూమరేటర్లగా ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు, గ్రామ పంచాయతీ
కార్యదర్శులు,విఓఎస్ లను నియమించినట్లు తెలిపారు.గణనకు 150 ఇళ్లను ఒక ఎన్యూమరేషన్ బ్లాక్ గా కేటాయించినట్లు కలెక్టర్ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమాల్లో జెడ్పి సీఈఓ సర్వే నోడల్ అధికారి రామిరెడ్డి, సిపిఓ గోవింద రాజన్, ఎంపిడిఓ లు, తహశీల్దార్లు,సంబంధిత అధికారులు, సూపర్వైజర్లు,గణకులు తదితరులు పాల్గొన్నారు.











Leave a Reply