Advertisement

కేయూ లో విజిలెన్స్ దాడులు…

  • గతంలో విజిలెన్స్ నోటీసులకు స్పందించని రిజిస్ట్రార్ మళ్ళా రెడ్డి…
  • కీలకమయిన ఫైళ్ళు ఇవ్వడంలో జాప్యం…
  • సీడ్ మనీ పేరుతో వున్న ఫేక్ ప్రాజెక్టులపై ఆరా…
  • మాజీ వీసీ రమేష్ అక్రమ ప్రొమోషన్ పై ఆరా…
  • తప్పుడు సమాచారం ఇచ్చిన వీసీ రమేష్ పై చర్యలుంటాయా…

హన్మకొండ జోర్ధార్ ప్రతినిధి: మాజీ వీసీ తాటికొండ రమేష్ అక్రమాలపై గతంలో అసోసియేషన్ ఆఫ్ కాకతీయ యూనివర్సిటీ టీచర్స్ (అకూట్) బాద్యులు, వివిధ విద్యార్థి సంఘాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, విజిలెన్స్ అధికారులకు వేర్వేరుగా ఫిర్యాదు చేసారు. ప్రభుత్వం స్పందించి గత మూడేళ్ళలో వీసీ రమేష్ చేసిన అక్రమాలపై విజిలెన్స్ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. విజిలెన్స్ విచారణలో భాగంగా గత నాలుగు నెలల నుండి అనేక సార్లు కీలకమయిన ఫైళ్ళ గురుంచి రిజిస్ట్రార్ మల్లారెడ్డి కి నోటీసులు జారీచేసినా ఇప్పటి వరకు పలు కీలక ఫైళ్ళు విజిలెన్స్ అధికారులకు అప్పచేప్పకపోవడంతో విజిలెన్స్ అధికారులు వర్సిటీ రిజిస్ట్రార్ వైఖరిపై సీరియస్ అయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నేరుగా విజిలెన్స్ ఎ.ఎస్.పీ. బాలు కోటి, సి.ఐ రాకేశ్ లతో కూడిన బృందం ఈరోజు యూనివర్సిటీ పాలనా భవనానికి రావడం సంచలనం సృష్టించింది. కొద్ది సేపు హడావిడి జరిగినా రిజిస్ట్రార్ మళ్ళా రెడ్డి లేకపోవడంతో రిజిస్ట్రార్ చాంబర్ లో విజిలెన్స్ అధికారులు కూర్చొని ఇంచార్జీ రిజిస్ట్రార్ ప్రో నరసింహ చారి, ఫైనాన్స్ ఆఫీసర్, ఆడిట్ అధికారులను, స్టేట్ లోకల్ అధికారులను పిలుపించుకొని మూడేళ్ళలో జరిగిన అక్రమాలపై ఆరా తీసినట్లు సమాచారం.

మాజీ వీసీ రమేష్ అక్రమ ప్రమోషన్ పై ఆరా….

యూనివర్సిటీ చట్టం, జీవో నెంబర్ 15 ప్రకారం సీనియర్ ప్రొఫెసర్ ప్రమోషన్ కొరకు సెలెక్షన్ కమిటీలో ఖచ్చితంగా వీసీ చైర్మన్ గా వుండాలని ఉన్నప్పటికీ, ఒక వేల వీసీ అప్లికేంట్ అయితే ప్రభుత్వం ద్వారా నియమింప బడిన ఒక ఇంచార్జీ వీసీ సెలెక్షన్ కమిటీ చైర్మన్ గా ఉండేలా చూసుకోవాలని అలా కాకుండా ప్రో.మల్లారెడ్డి ని సెలెక్షన్ కమిటీ చైర్మన్ గా నియమించి రమేష్ తన సీనియర్ ప్రొఫెసర్ ప్రమోషన్ ను తీసుకున్నారని విజిలెన్స్ వారికి వచ్చిన ఫిర్యాదు ఆధారంగా, ఈరోజు విజిలెన్స్ అధికారులు వాటికి సంబందించిన సెలెక్షన్ కమిటీ ప్రొసీడింగ్స్ అడిగినట్లు సమాచారం. ఇటువంటి ఫైళ్ళు విజిలెన్స్ వారికీ ప్రో.మళ్ళా రెడ్డి ఇప్పటి వరకు ఇవ్వకపోవడం, అంతేకాకుండా ఈరోజు ప్రో మళ్ళా రెడ్డి విజిలెన్స్ వారికి అందుబాటులో లేకపోవడంతో విజిలెన్స్ అధికారులు రిజిస్ట్రార్ మల్లారెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. మూడు సంవత్సరాల ఆడిట్ రిపోర్టును విజిలెన్స్ అధికారులు తమ వెంట తీసుకెల్లినట్టు సమాచారం.

ప్రాజెక్టుల పరిశీలన జరిగిందా.. ప్రశ్నించిన విజిలెన్స్ అధికారి…

కాకతీయ యూనివర్సిటీలో ఆరుగురు ప్రొఫెసర్లకు సీడ్ మనీ పేరుతొ ఫేక్ ప్రాజెక్టులు మంజూరు చేసినట్లు రిజిస్ట్రార్ ప్రో.టి.శ్రీనివాస రావు ఆర్డర్ తీసిన విషయం గతంలో వెలుగులోకి వచ్చింది. యూనివర్సిటీ లో పనిచేస్తున్న టీచర్లకు మైనర్ రిసెర్చి ప్రాజెక్టు కింద రూ.ఇరవై లక్షలు సీడ్ మనీ అందించడానికి కేయూ వైస్ చాన్సలర్ రమేష్ నవంబర్ 19, 2022 నాడు నోట్ అప్ప్రోవల్స్ ఇచ్చినట్లు తెలిసింది. ఈ నోట్ ను ఆధారంగా చేసుకొని అదే నెల తేది 21 న ఇదే విషయాన్ని వెల్లడి చేస్తూ ప్రతి సంవత్సరం కేవలం పది ప్రాజెక్టులకు అనుమతులు ఇస్తామని, ప్రతి ప్రాజెక్టుకు రూ.రెండు లక్షలు కేటాయిస్తున్నట్లు, ప్రతి ప్రాజెక్టు రెండు సంవత్సరాలు కాల పరిమితి ఉంటుందని, ఆ తర్వాత ప్రోజేక్ట్ రిపోర్ట్ ను రిసెర్చి మరియు డెవలప్మెంట్ సెల్ డైరెక్టర్ కు సమర్పించాల్సి ఉంటుందని రిజిస్ట్రార్ ప్రో.టీ. శ్రీనివాస్ రావు ఉత్తర్వులు జారీ చేసారు. అదే నెల 24 వ తేదీన ఆరుగురు ప్రొఫెసర్లకు మైనర్ రిసెర్చి ప్రాజెక్టులను సీడ్ మనీ నుండి మంజూరు చేస్తున్నట్లు రిజిస్ట్రార్ విడి విడిగా ఆరుగురు ప్రొఫెసర్లకు మంజూరు ఉత్తర్వులు జారీ చేసారు. ఈ ఆరుగురిలో రసాయన శాస్త్ర విభాగానికి చెందిన డా.టీ. సవిత జ్యోత్స్న, కామర్స్ విభాగానికి చెందిన ప్రో.టీ. శ్రీనివాస రావు, డా. ఎస్. నరసింహ చారీలు, కంప్యూటర్ సైన్స్ విభాగానికి చెందిన డా.ఎం.వేణుగోపాల్ రెడ్డి, గణిత శాస్త్ర విభాగానికి చెందిన ప్రో.పీ.మల్లారెడ్డి, భూగర్భ శాస్త్ర విభాగానికి చెందిన ప్రో.ఆర్.మల్లికార్జున్ రెడ్డి లు వున్నారు.

నోటిఫికేషన్ లేకుండానే ఫేక్ ప్రాజెక్టులు మంజూరు….

నవంబర్ 19 న రిజిస్ట్రార్ జారీ చేసిన ఉత్తర్వుల్లో ప్రాజెక్ట్ ప్రపోజల్స్ ఫలానా తేదీ లోపల సమర్పించమని లేకపోవడం గమనార్హం. అంతే కాకుండా అందరు ప్రిన్సిపాల్స్ మరియు విభాగ అధిపతుల ద్వారా యూనివర్సిటీ టీచర్లకు ఆ ఉత్తర్వులు సర్కులేట్ చేయాలని వున్నా ఆ ఉత్తర్వులను మాత్రం విభాగ అధిపతులకు గాని, ప్రిన్సిపాల్స్ లకు గాని ఇవ్వలేదని తెలిసింది. ఈ ఉత్తర్వుల విషయం ఎవరికీ తెలియకుండానే ఆరుగురు ప్రొఫెసర్లు తమ ప్రాజెక్టు ప్రపోజల్స్ లను రెండు రోజుల్లోనే తయారు చేసి ఎలా సమర్పించగాలిగారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోయింది. కనీసం రిజిస్ట్రార్ ఉత్తర్వుల్లో ప్రాజెక్టు ప్రపోజల్స్ లను సంపర్పించడానికి చివరితెదీని కూడా ఉత్తర్వుల్లో పేర్కొనలేదు, ఎవరికీ సమర్పించాలో కూడా పేర్కొనలేదు. కాని ఆరుగురు ప్రొఫెసర్లు ఎలా సమర్పించారో తేలాల్సి వుంది.

సీడ్ మనీ పేరుతో వున్న ఫేక్ ప్రాజెక్టులపై ఆరా…

ప్రాజెక్టులను మంజూరు చేస్తున్నట్లు అదే నెల 24 వ తేదీన రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేయడం వెనుక మతలబు ఆంతర్యం ఏమిటో తేలాల్సి వుంది. 21న ప్రాజెక్టుల సమాచారంతో రిజిస్ట్రార్ ఇచ్చిన ఉత్తర్వులకు 24 లోపల ప్రాజెక్టులు సమర్పిస్తే ఆ ప్రాజెక్టులను ఎవరు, ఎప్పుడు పరిశీలించి సెలెక్ట్ చేశారో వాటికి సంబందిచిన రిపోర్టును అందివ్వమని విజిలెన్స్ అధికారులు అడిగినట్లు సమాచారం. వీసీ కి దగ్గరగా వుండే అనూయాయుల పేరు మీద మంజూరు ఉత్తర్వులు ఉండడం, అంతే కాకుండా తన ప్రాజెక్టు మంజూరు ఉత్తర్వులపై తానె (అప్పటి రిజిస్ట్రార్ ప్రో.శ్రీనివాస్ రావు) సంతకం చేసుకోవడం అనుమానాలకు తావిస్తుంది. ప్రాజెక్టుకు సంబందించిన ప్రతి ఉత్తర్వులు ఐ.క్యూ.ఎ.సి సెల్ నుండే వెలువడ్డాయి. ఐ.క్యూ.ఎ.సి సెల్ డైరెక్టర్ డా. ఎస్. నరసింహ చారీ పేరుతో తనే డైరెక్టర్ గా వున్న సెల్ నుండి వెలువడిన ఉత్తర్వుల్లో తన పేరుతోనే వుండడం కూడా గమనించదగ్గ విషయం. కంప్యూటర్ సైన్స్ విభాగానికి చెందిన డా. వేణుగోపాల్ రెడ్డి, జియాలజీ విభాగం ప్రొఫెసర్ మల్లికార్జున రెడ్డి లకు అసలు ప్రాజెక్ట్ మంజూరు ఉత్తర్వులు తన పేరుతొ వున్న విషయం కూడా తెలువదని సమాచారం. న్యాక్ అధికారులకు తప్పుడు ఫేక్ ప్రాజెక్టుల సమాచారం ఇచ్చిన మాజీ వీసీ రమేష్, రిజిస్ట్రార్ శ్రీనివాస్ రావులపై ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయనే ఉత్కంట నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *