కేయూ పరీక్షల విభాగం కంట్రోలర్ చారీ తొలగింపు…
ఐసెట్ కుంభకోణంలో పాత్రధారిగా గతంలో ఫిర్యాదులు….
29 లక్షలు తన స్వంత అకౌంట్లోకి మార్చుకున్నారని ఆరోపణలు….
కంట్రోలర్ గా ప్రో. కట్ల రాజేందర్….
(5 డిసెంబర్, హనుమకొండ జొర్దార్ రావుల రాజేశం)
కాకతీయ యూనివర్సిటీ పరీక్షల విభాగం కంట్రోలర్ గా కామర్స్ విభాగం ప్రొఫెసర్ కట్ల రాజేందర్ ను నియమిస్తూ కేయూ రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదివరకు కంట్రోలర్ గా వున్న అదే విభాగానికి చెందిన ప్రో. నరసింహా చారీ పై ఇటీవల ఐసెట్ కుంభకోణానికి సంబంధించిన ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఐసెట్ పరీక్షల నిర్వహణ, కాన్ఫిడెన్షియల్ పేరు మీద ఏకంగా 29 లక్షలు తన వ్యక్తిగత ఖాతాలోకి ఐసెట్ అకౌంట్ నుండి మార్చుకున్నట్టు అకౌంట్ స్టేట్మెంట్ కూడా బయటకు రావడంతో కేయూ అధికారులు అలెర్ట్ అయినట్టు తెలుస్తోంది. ఇటీవల పాత డేట్ లతో కొన్ని బిల్లులు, అప్రోవల్స్ మీద కూడా సంతకాల కోసం ప్రయత్నాలు జరిపినట్లు సమాచారం. ఈ అభియోగాలపై కేయూ వీసీ, రిజిస్ట్రార్ లతో బాటు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రో. బాల కిష్టా రెడ్డికి కూడా గతంలో విద్యార్థి సంఘాలు ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో ప్రో. చారీని పరీక్షల విభాగం కంట్రోలర్ పదవీ నుండి తొలగించడం యూనివర్సిటీలో చర్చనీయాంశం అయింది. కంట్రోలర్ గా 8 నెలలు పనిచేసిన ప్రో. చారీ నీ తొలగించడంతో ఉన్నత విద్యా మండలి కూడా ఐసెట్ కుంభకోణంపై విచారణ జరిపే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
కంట్రోలర్ గా ప్రో. కట్ల రాజేందర్….
కేయూ పరీక్షల విభాగం కంట్రోలర్ గా నియామకం కాబడిన కామర్స్ విభాగం ప్రో. కట్ల రాజేందర్ గతంలో కాన్ఫిడెన్షియల్ పరీక్షల విభాగంలో అడిషనల్ కంట్రోలర్ గా పని చేసారు. కామర్స్ విభాగం హెడ్ గా, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ గా గతంలో పని చేశారు. కేయూ కామర్స్ కాలేజీ తో బాటు ఖమ్మంలోని పీజీ కాలేజీ ప్రిన్సిపాల్ గా కూడా గతంలో పని చేసారు. ప్రో. రాజేందర్ పలువురు ప్రొఫెసర్లు ఈ నేపథ్యంలో అభినందించారు.













Leave a Reply