|
(డిసెంబర్ 9, 2024, జోర్ధార్ హన్మకొండ ప్రధినిధి):
విద్యార్థి వ్యతిరేక నిర్ణయాలకు పాల్పడుతున్న కేయూ రిజిస్ట్రార్ ప్రో.మళ్ళా రెడ్డి రాజీనామా చెయ్యాలని కేయూ విద్యార్ధి సంఘాల నేతలు కేయూ పాలక భవనం ముందు ధర్నా చేసారు. విద్యార్థులకు న్యాయం చెయ్యాలి, రిజిస్ట్రార్ రాజీనామా చెయ్యాలి అంటూ నినాదాలు చేస్తూ పాలక భవనం ముందర గంట సేపు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ, పోటీ పరీక్షలు ఈ నెల 15 వ తేది న పూర్తీ అవుతున్నందున 18 నుండి జరగనున్న పీజీ మూడవ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని, దూరం ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులు పోటీ పరీక్షలు వ్రాసి మళ్ళీ 18 వరకు పీజీ పరీక్షలు రాయడానికి కేయూ కు రావడానికి ఇబ్బందులు ఎదురవుతాయని, అంతేకాకుండా యూజీసీ నెట్ పరీక్షలు కూడా వున్నాయని పీజీ పరీక్షలను వాయిదా వేసి జనవరి లో నిర్వహించాలని అన్నారు.
కేయూ మొదటి గేటు వద్ద ధర్నా…..
రిజిస్ట్రార్, వీసీ లు అందుబాటులో లేనందున పాలక భవనం నుండి విద్యార్థులు కేయూ మొదటి గేటు వద్దకు చేరుకొని గేటు మూసివేసి అక్కడే కూర్చొని నినాదాలు ఇస్తూ ధర్నా చేపట్టారు. పోలీసులు వారించినా వినిపించుకోలేదు. కంట్రోలర్, అడిషినల్ కంట్రోలర్ లు వచ్చి సముదాయించే ప్రయత్నాలు చేసారు. ప్రిన్సిపాల్ ప్రో. సురేష్ లాల్ కూడా విద్యార్థులతో మాట్లాడారు. రిజిస్ట్రార్, వీసీ లు అందుబాటులో లేనందున రేపు ఉదయం రిజిస్ట్రార్, వీసీ లతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని అనడంతో విద్యార్థులు రేపటి వరకు ధర్నాను వాయిదా వేసారు. ఈ ధర్నాలో కేయూ లోని వివిధ విద్యార్థి సంఘాల నేతలు పాల్గొన్నారు.

కేయూ మొదటి గెట్ వద్ద ధర్నా చేస్తున్న విద్యార్థులు













Leave a Reply