Advertisement

కేయూలో మూడు రోజుల శిక్షణా శిబిరం

విద్యార్థుల్లో ఏకాగ్రత పెంచడానికే శిబిరం
-కేయూ వీసీ ప్రో. ప్రతాప్ రెడ్డి

జోర్ధార్ హన్మకొండ ప్రతిన్నిధి (డిసెంబర్ 15): డిసెంబర్ 21 న వరల్డ్ మెడిటేషన్ డే సందర్భంగా కాకతీయ యూనివర్సిటీ డీన్ స్టూడెంట్ అఫైర్స్ మరియు కేయూ యోగా సెంటర్ కలిసి సంయుక్తంగా నిర్వహించే మూడు రోజుల శిక్షణా శిబిరానికి సంబంధించిన బ్రోచర్ ను సోమవారం కాకతీయ విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్ ఛాంబర్‌లో కేయూ వీసీ ప్రొఫెసర్ కె. ప్రతాప్ రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి. రామచంద్రం తో కలిసి ప్రొఫెసర్ మామిడాల ఇస్తారీ, డీన్ స్టూడెంట్ అఫైర్స్, ప్రొఫెసర్ ఎస్. జ్యోతి, ఆర్ట్స్‌ కాలేజ్ ప్రిన్సిపల్, యోగా సెంటర్ డైరెక్టర్, హార్ట్‌ఫుల్‌నెస్ ట్రైనర్స్ ప్రొఫెసర్ అచ్చయ్య, డాక్టర్ ఎన్. రాంబాబు, శ్రీ ఎస్. శ్రీధర్ మరియు హెల్త్ సెంటర్ డైరెక్టర్ ప్రొఫెసర్ ప్రసాద్ లు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కేయూ ఉపకులపతి ప్రో ప్రతాప్ రెడ్డి, రిజిస్ట్రార్ ప్రో. రామచంద్రం మాట్లాడుతూ, “హార్ట్‌ఫుల్‌నెస్ ఫర్ అకాడమిక్ ఎక్సలెన్స్” అనే అంశంపై మూడు రోజుల వర్క్‌షాప్ ను కేయూ లోని సెనేట్ హాల్ లో నిర్వహించడం అభినందనీయం అని అన్నారు.

కార్యక్రమ నిర్వాహకులు ప్రో. మామిడాల ఇస్తారి, ప్రో. ఎస్. జ్యోతి లు మాట్లాడుతూ, ఈ వర్క్‌షాప్‌ డీన్ స్టూడెంట్ అఫైర్స్ కార్యాలయం ఆధ్వర్యంలో, కాకతీయ విశ్వవిద్యాలయం యోగా సెంటర్ సహకారంతో, హార్ట్‌ఫుల్‌నెస్ ఇనిస్టిట్యూట్ నిపుణుల మార్గదర్శకత్వంలో కాకతీయ యూనివర్సిటీ గోల్డెన్ జూబిలీ వేడుకల భాగంగా నిర్వహిస్తున్నామని అన్నారు. డిసెంబర్ 19 నుండి 21 వరకు మూడు రోజులపాటు సాయంత్రం 4:00 గంటల నుండి 5:30 గంటల వరకు సెనేట్ హాల్, కేయూ క్యాంపస్‌లో ఈ శిక్షణా తరగతులు జరుగుతాయని అన్నారు. కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్ లో ఉన్న కాలేజీలతో బాటు సుబేదరీ హన్మకొండలో ఉన్న కేయూ అనుబంధ కళాశాలల విద్యార్థులు ఈ మూడు రోజుల వర్కషాప్ లో పాల్గొనవచ్చని తెలిపారు. విద్యార్థులందరికీ ఉచితంగానే ఈ వర్క్ షాప్ లో పాల్గొనే విధంగా అవకాశం ఇస్తున్నామనీ, కేయూ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ కోసం అవసరమైన లింక్ ను పొందుపరుస్తున్నామని అన్నారు. ఈ నెల 17 వ తేదీ లోపల విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. 21 న జరిగే ముగింపు కార్యక్రమంలో వర్క్ షాప్ లో మూడు రోజుకు పాల్గొన్న విద్యార్థులందరికీ సర్టిఫికెట్ లు అందజేస్తామని తెలిపారు.

వర్క్ షాప్ బ్రోచర్ ను విడుదల చేస్తున్న కేయూ అధికారులు

విద్యార్థుల్లో ఏకాగ్రత పెంచడానికే ఈ శిబిరం…

ఈ మూడు రోజుల వర్క్‌షాప్‌లో రిలాక్సేషన్ & మెడిటేషన్, రీజువెనేషన్ (క్లీనింగ్), కనెక్షన్ విత్ సెల్ఫ్ అనే అంశాలపై థియరీ, ప్రాక్టీస్ మరియు చర్చా సెషన్లు నిర్వహించబడతాయని. విద్యార్థులలో ఏకాగ్రత, మానసిక ప్రశాంతత, సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు పెంపొందించడం, విద్యా ప్రగతికి తోడ్పడడం, ఒత్తిడి తగ్గించడం, సమాజం పట్ల బాధ్యతా భావం పెంచడం ఈ వర్క్‌షాప్ ప్రధాన లక్ష్యం అని నిర్వాహకులు తెలిపారు. కేయూ స్వర్ణోత్సవ వేడుకల సందర్భంలో విద్యార్థుల అకాడమిక్ ఎక్సలెన్స్‌తో పాటు మానసిక ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం, సమగ్ర వ్యక్తిత్వ వికాసం సాధించడానికి ఈ కార్యక్రమం ప్రత్యేకంగా రూపొందించబడిందనీ డీన్ స్టూడెంట్ అఫైర్స్ ప్రో మామిడాల ఇస్తారి, యోగా సెంటర్ డైరెక్టర్ ప్రో. జ్యోతి లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *