Advertisement

ఆరోగ్యమే విద్యార్థుల విజయానికి పునాది

ఆరోగ్యమే విద్యార్థుల విజయానికి పునాది
_ డా పూర్ణిమా

డీన్, స్టూడెంట్ అఫైర్స్, యూనివర్సిటీ పీజీ కాలేజీ, యూనివర్సిటీ మహిళా కళాశాల, సుబేదారి కాకతీయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా పీ.సీ.ఓ.ఎస్ అవేర్‌నెస్ వర్క్‌షాప్ను సుబేదారి పీజీ కాలేజీ ప్రో జయశంకర్ సెమినార్ హాల్ లో మంగళవారం ఘనంగా నిర్వహించారు.

 

వివో లైఫ్ సెన్సెస్, హైదరాబాద్ కు చెందిన డా పూర్ణిమా ముఖ్య వక్తగా విచ్చేసి సీ.పీ.ఓ.ఎస్.గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు, సీ.పీ.ఓ.ఎస్ లక్షణాలు, కారణాలు, నివారణ మార్గాలు, జీవనశైలి మార్పుల ప్రాధాన్యతపై విశదంగా వివరించారు. డా పూర్ణిమా మాట్లాడుతూ, ఈ సమస్య యువతిలో సాధారణంగా కనిపించే హార్మోనల్ అసమతుల్యత అని, ఇందులో పురుష హార్మోన్ అయిన టెస్టోస్టెరోన్ స్థాయిలు పెరగడం వల్ల స్త్రీ హార్మోన్ ఎస్ట్రోజన్ ఉత్పత్తి ఆగిపోతుందని వివరించారు. దీని ప్రభావంగా గర్భాశయంలో ఫాలికుల్స్ అభివృద్ధి చెందకుండా నిలిచిపోతాయి, ఫలితంగా సిస్టులు ఏర్పడి మాసిక ధర్మం అసమర్థంగా మారుతుందని చెప్పారు. ముఖ్యంగా ఆహార నియమాలు, నియమిత వ్యాయామం, జీవనశైలి మార్పులు ద్వారా సీ.పీ.ఓ.ఎస్ ను నియంత్రించవచ్చని సూచించారు. అదేవిధంగా, వైద్య సలహా తీసుకోవడం, నిరంతర ఆరోగ్య పరిశీలన చేయడం ద్వారా దీన్ని సమర్థంగా ఎదుర్కోవచ్చని చెప్పారు. ఈ అవగాహన కార్యక్రమం విద్యార్థుల్లో ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.

మాట్లాడుతున్న డా పూర్ణిమ

వివో లైఫ్ సైన్సెస్  అధినేత డా హరికాంత్ మాట్లాడుతూ, విద్యార్థులు ఫోన్ లకు దూరంగా ఉండి, ఆరోగ్యమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా అనేక వ్యాధులకు దూరంగా ఉండవచ్చని పిలుపు నిచ్చారు.

హాజరైన పీజీ మహిళా కళాశాల, పీజీ కళాశాల విద్యార్థినులు

ఈ కార్యక్రమంలో సుబేదారి పీజీ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రో. నరసింహ చారి, మహిళా కాలేజీ ప్రిన్సిపాల్ ప్రో. జీ. సౌజన్య, డీన్ స్టూడెంట్ అఫైర్స్ ప్రో మామిడాల ఇస్తారి, యూత్ వెల్ఫేర్ ఆఫీసర్లు డా నిరంజన్, డా రాధిక, మహిళా కాలేజీ, పీజీ కాలేజీ అధ్యాపకులు డా రమాదేవి, డా సరిత, డా బాగ్యమ్మ, డా రజిత, డా. భాగ్యలక్ష్మి, డా. కవిత, ప్రీతి, డా. జ్యోత్స్న లతో పాటు రెండు కళాశాలల పీజీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *