Advertisement

ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు శుక్రవారం సెలవు – వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్య శారద

వరంగల్ జోర్దార్ ప్రతినిథి, 29 జనవరి 2026 :

మేడారం మహా జాతర సందర్భంగా ఈ నెల 30వ తేదీ (శుక్రవారం) జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర విద్యా సంస్థలకు స్థానిక సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద నేడోక ప్రకటనలో తెలిపారు. ఈ స్థానిక సెలవుకు బదులుగా ఫిబ్రవరి 14వ తేదీ (రెండవ శనివారం) ను పనిదినంగా పరిగణించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. సంబంధిత శాఖల అధికారులు, విద్యా సంస్థల యాజమాన్యాలు ఈ విషయాన్ని గమనించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *