Advertisement

జోర్దార్ వార్త కథనానికి స్పందన

*జోర్దార్ వార్త కథనానికి స్పందించిన పెద్దపెల్లి జిల్లా విద్యాశాఖ*

కరీంనగర్ జోర్దార్ నిఘా విభాగం

“పెద్దపల్లిలో బడిపంతుల్ల సైడ్ దందాలు” పేరిట జోర్దార్ వార్తాపత్రికలో తేదీ10 డిసెంబర్ రోజున ప్రచురించిన వార్త కథనానికి జిల్లా విద్యాశాఖ స్పందించింది. డీఈవో మాధవి జోర్దార్ వార్తా కథనంలో పేర్కొన్న మేరకు అక్రమాలకు పాల్పడ్డ ఉపాధ్యాయులపై సీసీఏ నిబంధన ప్రకారం చర్యలు చేపట్టాలని ఎంఈఓ లకు ఆదేశాలు జారీ చేశారు.
జిల్లాలో అనేకమంది ప్రభుత్వ ఉపాధ్యాయులు పేద, బడుగు బలహీన వర్గాల విద్యార్థుల అభ్యున్నతి కోసం విశేషంగా శ్రమిస్తున్నప్పటికీ కొందరు ధనార్జన పరులైన ఉపాధ్యాయుల సైడ్ దందాల కారణంగా విద్యా వ్యవస్థకు చెడ్డ పేరు వస్తోంది. కొందరు ఉపాధ్యాయులు అక్రమ సంపాదన ధ్యేయంగా పాఠశాల విధులకు తూట్లుపొడుస్తూ రియల్ ఎస్టేట్ ,వాటర్ ప్లాంట్ లు, గొలుసు కట్టు వ్యాపారాలు లాంటి దందాలకు పాల్పడుతున్న వైనాన్ని ప్రజా, విద్యార్థి సంఘాలు జోర్దార్ వార్తా పత్రికకు తెలియజేసిన కారణంగా ప్రజా ప్రయోజనం దృష్ట్యా జోర్దార్ దినపత్రిక ఈ వార్తను ప్రచురించింది. రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ఎంతో కృషి చేస్తున్నా సైడ్ దందాలకు పాల్పడుతున్న కొందరు టీచర్ల కారణంగా మొత్తం జిల్లా విద్యా వ్యవస్థ అభాసు పాలవుతోంది. ఇప్పటికైనా సైడ్ దందాలను మానుకొని ఉపాధ్యాయులు బాధ్యతాయుత విధి నిర్వహణతో విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని మరియు అధికారులు సైతం చర్యలు చేపట్టి విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాలని జోర్దార్ యాజమాన్యం కోరుతున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *