నూతన ఎంఈఓ కు శుభాకాంక్షలు తెలిపిన డిటిఎఫ్
భీమదేవరపల్లి జోర్దార్ విలేఖరి
భీమదేవరపల్లి మండలం నూతన ఎంఈఓ గా పదవి బాధ్యతలు స్వీకరించిన ఎం సునీత రాణిని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యదర్శి అటుకుల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక ఉపాధ్యాయుల సమస్యలపై అవగాహన కలిగిన ఎంఈఓ తమ వృత్తి జీవితంలో రాణించాలని కోరారు.
ఎమ్మార్సీ మండల కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో డి టి ఎఫ్ స్థానిక మండల శాఖ అధ్యక్షులు దాసరి రవీందర్ మరియు సీనియర్ కార్యకర్తలు గొర్రె చిరంజీవి, శ్రీకాంత్, సుందర్ సునీల్ మరియు నోముల శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.













Leave a Reply