Advertisement

కేయూ అసిస్టెంట్ రిజిస్ట్రార్ అశోక్ బాబు సస్పెన్షన్

  • ఉత్తర్వులు జారీ చేసిన కేయూ రిజిస్ట్రార్…
  • కేయూ క్రమశిక్షణా నిబంధనలు ఉల్లంఘించారని చర్యలు
  • వర్సిటీ స్థలంలో ఇల్లు కట్టుకున్నారని ఫిర్యాదు

కాకతీయ యూనివర్సిటీ అసిస్టెంట్ రిజిస్ట్రార్ పెండ్లి అశోక్ బాబును సస్పెన్షన్ చేస్తూ ఇంచార్జీ వీసీ ఆమోదంతో కేయూ రిజిస్ట్రార్ ప్రో.మల్లారెడ్డి ఉత్తర్వులు జారీచేసారు. కేయూ అధ్యాపక సంఘం, వివిధ విద్యార్థి సంఘాలు ప్రభుత్వానికి, విజిలెన్స్ కు భూ ఆక్రమణల మీద ఇచ్చిన ఫిర్యాదులను ఆధారంగా చేసుకొని ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా కేయూ భూముల ఆక్రమణల మీద విజిలెన్స్ విచారణ, రెవెన్యూ శాఖ వారి సర్వే పూర్తయిన నేపథ్యంలో ఏం.ఆర్.వో నుండి రిజిస్ట్రార్ కు సర్వే నెంబర్ 229 ఆక్రమణల రిపోర్టు రావడంతో రిజిస్టర్ మల్లారెడ్డి ఎమ్మార్వో రిపోర్టును ఆధారంగా చేసుకుని మున్సిపల్ అధికారులను కలిసి 229 సర్వే నంబర్లలో ఉన్నటువంటి ఇండ్లను కూల్చివేయాలని కోరినట్లు సమాచారం. మున్సిపల్ అధికారులు ఈ సర్వే నంబర్లలో ఉన్నటువంటి వారికి ఇప్పటి వరకు నోటీసులు కూడా మున్సిపల్ వాళ్ళు ఇవ్వలేదు. మున్సిపల్ వారు నోటీసులు ఇవ్వడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మల్లారెడ్డి ఈ సర్వే నంబర్ లో ఉన్నటువంటి యూనివర్సిటీలో పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులకు మెమోలు జారీ చేశారు. మూడు రోజుల్లోగా సమాధానము చెప్పాలని మెమోలో పేర్కొన్నారు. పెండ్లి అశోక్ బాబు తో సహా మిగిలిన ముగ్గురు ఉద్యోగులు మెమో కు సమాదానంగా రిజిస్ట్రార్ కు ప్రత్యుత్తరాలను సమర్పించారు. ఇటీవలే రిజిస్టర్ ప్రొఫెసర్ మల్లారెడ్డి వీటికి సంబంధించిన ఫైల్ తో ఇంచార్జ్ వీసీ వాకాటి కరుణ దగ్గరకు వెళ్లగా ఏ ఆర్ అశోక్ బాబుతో సహా మిగిలిన ముగ్గురిని సస్పెండ్ చేయాలని వాకటి కరుణ ఆదేశించినట్లు సమాచారం.

గాంధీ జయంతి వేడుకల్లో ఏ.ఆర్. అశోక్ బాబు వీరంగం

2024 అక్టోబరు 2న రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు పరిపాలనా భవనంలో మహాత్మాగాంధీకి నివాళులు అర్పిస్తూ శాంతియుతంగా రిజిస్ట్రార్ గాంధీ జయంతి వేడుకలు నిర్వహిస్తుండగా, పి. అశోక్ బాబు అక్కడికి వచ్చారని కార్యక్రమం జరుగుతున్న స్థలంలోనే రిజిస్ట్రార్ కు ఇబ్బంది కలిగిస్తూ గందరగోళాన్ని సృష్టించారని అశోక్ బాబు కు ఇచ్చిన సస్పెన్షన్ ఆర్డర్ లో పేర్కొన్నారు. అశోక్ బాబు ప్రవర్తన యూనివర్శిటీ ఉద్యోగుల ప్రవర్తనా నియమావళికి విరుద్ధం అని, కాకతీయ యూనివర్శిటీ ఎంప్లాయీస్ కండక్ట్ రూల్స్ 1976 (1) ప్రకారం ప్రతి యూనివర్సిటీ ఉద్యోగి అన్ని సమయాలలో సంపూర్ణ సమగ్రతను మరియు విధి పట్ల భక్తిని కలిగి ఉండాలని, యూనివర్శిటీ యొక్క గౌరవం మరియు ప్రతిష్టకు విరుద్ధంగా భంగం కలిగించకూడదని సస్పెన్షన్ ఆర్డర్ లో పేర్కొన్నారు. యూనివర్శిటీ ఉద్యోగి గౌరవానికి భంగం కలిగించే విధంగా యూనివర్శిటీ అడ్మినిస్ట్రేషన్‌పై బహిరంగంగా విమర్శలు చేయడం మరియు దానితో సంబంధించి పరిపాలనకు ఇబ్బంది కలిగించడం వంటివి చేసి బహిరంగంగా మాట్లాడడం సివిల్ సర్వీసెస్ (ప్రవర్తన) నియమాలు 1964, 17 (1)] ప్రకారం విరుద్ధం అని పేర్కొంటూ తక్షణమే సస్పెన్షన్ అమల్లోకి వస్తుందని అతని సస్పెన్షన్ వ్యవధిలో నిబంధనల ప్రకారం అతనికి జీవనాధార భత్యం చెల్లించబడుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *