Advertisement

కేయూ ఇన్చార్జి వీసీని తప్పుదోవ పట్టిస్తున్న కేసీఆర్ సన్నిహితుడు….

(హనుమకొండ జోర్డర్ నిఘ విభాగం):
కాకతీయ యూనివర్సిటీలో బీ.ఆర్.ఎస్ ప్రభుత్వం నియమించిన మాజీ వీసీ అనేక అక్రమాలకు పాల్పడి విజిలెన్స్ విచారణను ఎదుర్కొంటున్న విషయం మరవక ముందే అదే ప్రభుత్వంలో గతంలో ఉన్నత విద్యా శాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీ గా పని చేసిన ఓ అధికారి ప్రస్తుతం మళ్ళీ కేయూ లో బీ.ఆర్.ఎస్ లీడర్ సిఫార్సుతో అక్రమాలకు పాల్పడుతున్నట్లు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి, ప్రస్తుత ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీకి ఫిర్యాదులు వెళ్లాయి.

అక్రమ ఫైల్ ఆమోదం కొరకు జోరుగా ప్రయత్నాలు?

నవంబర్ 9, 2021 లో కేయూలో పనిచేస్తున్న నలుగురు ప్రొఫెసర్ల కొరకు అప్పటి బీ.ఆర్.ఎస్ ప్రభుత్వం జీవో నెంబర్.248 ను జారీ చేసింది. నలుగురు ప్రొఫెసర్ల సర్వీసును 2003 నుండి కొత్త సర్వేసుతో కలుపుకోవాలని మరియు పదోన్నతి బెనిఫిట్స్ తో పాటు ఇతర బెనిఫిట్స్ ను జీవో నెంబర్.208, 1999 జీవో ప్రకారం పొందేలా రిజిస్ట్రార్ కు అదేశిస్తున్నట్లు జీవో లో అప్పటి ప్రభుత్వ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా పేర్కొన్నారు. జీవో నెంబర్.208, 1999 ప్రకారం పాత సర్వీసును కల్పుకోవాల్సిన అవసరం వస్తె కేవలం పదోన్నతి బెనిఫిట్స్ మాత్రమే పొందవచ్చని వుంది. కేయూలోని నలుగురు ప్రొఫెసర్లు 2021 లో తెచ్చుకున్న జీవో అమలు కావాలంటే పాలక మండలి సమావేశం జరిగి ఆమోదం పొందాలి. 18 నవంబర్ 2021 లో 136వ పాలక మండలి సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చినప్పుడు అప్పటి పాలక మండలి ఈ జీవో ను మార్చుకొని రమ్మని తీర్మానించింది. అంతే కాకుండా ఈ నలుగురు ప్రొఫెసర్లు కేవలం పదోన్నతి బెనిఫిట్స్ మాత్రమే పొందడానికి అర్హులని మరే ఇతర పాత పెన్షన్ లాంటి బెనిఫిట్స్ పొందడానికి అర్హులు కారని కూడా ఈసీ తీర్మానించింది. ఈ తీర్మానాలను దృష్టిలో పెట్టుకొని 22 మార్చి 2022 న అప్పటి రిజిస్ట్రార్ ప్రో. వెంకట్ రాం రెడ్డి ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెల్తూ జీవో మోడిఫై కొరకు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శికి ఉత్తరం కూడా రాశారు. ఇలా ఈ విషయం ప్రభుత్వం వద్ద పెండింగ్లో వుండగా దానిని పక్కన పెట్టీ అక్రమ మార్గంలో బై సర్కులేషన్ లో అప్పటి ఈసీ తీర్మానాలను రివ్యూ చేస్తున్నట్లు, ఆ నలుగురు ప్రోఫెసర్లకు పాత పెన్షన్ విధానం అమలయ్యేలా గుట్టు చప్పుడు కాకుండా ఈసీ ఆమోదం కొరకు రంగం సిద్ధమైందని తెలిసింది. ఇప్పటికే పలువురు ఈసీ మెంబర్లతో ఆ ఫైల్ పై సంతకం పెట్టించినట్లు సమాచారం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *