Advertisement

పాఠశాల విద్యార్థులకు ఎన్ఆర్ఐ దంపతుల వివాహ వార్షికోత్సవ కానుక

విద్యార్థులకు ఎన్ఆర్ఐ దంపతుల వివాహ వార్షికోత్సవ కానుక

హనుమకొండ జోర్దార్ ప్రతినిధి

ఎన్నారై దంపతులు బడుగు శ్రీకర్-బడుగు భావన వారి వివాహదినోత్సవం సందర్భంగా
కాజీపేట (జాగీర్ ) దర్గాలోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత మరియు ఉర్దూ మీడియం పాఠశాలలకు చెందిన 200 మంది విద్యార్థులకు స్టీల్ ప్లేట్లు, బిస్కెట్ ప్యాకెట్స్,వేఫర్స్ లను తమ ప్రతినిధి రామకృష్ణ ద్వారా పంపిణీ చేశారు. హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎన్.ఎమ్.ఎమ్ స్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులు ఆత్మవిశ్వాసం పెంపొందించు కోవాలని,తమలో ఉన్న అంతర్గత సామర్థ్యాలను ఉపయోగించుకొని రాణించాలని, ఆసక్తి ఉన్న రంగాన్నే ఎన్నుకొని అభివృద్ధి చెందాలన్నారు. ఆత్మన్యూనతా భావాన్ని వీడి,క్రమశిక్షణ,పట్టుదలతో గొప్ప లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదివి,ఉన్నతస్థాయికి ఎదిగి ఇతరులకు సహాయం చేయాలని ఆకాంక్షించారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్ఎమ్ఎమ్.స్వామి మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు సహాయం చేసిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో యుపిఎస్ (ఉర్దూ మీడియం),ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు చాంద్ సుల్తాన,యం.రత్నాకుమారి, హైస్కూల్ స్టాఫ్ సెక్రటరి కె.శ్రీనివాస్, ఉపాధ్యాయులు రమాదేవి,మేరి,మునవర్ హుస్సేన్, సుమలత,సతీష్ పాల్ ,రాజు,రాంగోపాల్,శంషుద్దీన్,రాహుల్,మునవర్ యాస్మిన్ ,శాద్మిన్ భానో, విజయ, ధనలక్ష్మి ,స్వర్ణ మేరీ తదితర ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *