|
హన్మకొండ జోర్ధార్ ప్రతినిధి: కాకతీయ యూనివర్సిటీ లో కొందరు ప్రొఫెసర్లు అక్రమంగా పాత పెన్షన్ విధానంలోకి చెరెట్టు పన్నాగం పన్ని కేయూ రిజిస్ట్రార్ ప్రో. మళ్ళా రెడ్డి తో కుమ్మక్కయి వారికి అనుగుణంగా వీసీ వాకాటి కరుణకు చెప్పించి ఈసీ లో ఆమోదం కొరకు ఫైల్ పెట్టించారనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జియలజీ విభాగానికి చెందిన ప్రో. మల్లి కార్జన్ రెడ్డి, బొటనీ విభాగానికి చెందిన రిటైర్డు ప్రొఫెసర్ కృష్ణా రెడ్డి, గణిత విభాగానికి చెందిన మరో ప్రొఫెసర్ సుమతి ఉమా మహేశ్వరీ లతో బాటు మరొకరి పేర్లతో కూడిన ఫైల్ ను పాలక మండలి ఆమోదం కొరకు ఇటీవల బై సర్కులేషన్ లో పెట్టినట్లు సమాచారం.
ఈసీ ఆమోదం కొరకు పెట్టిన ఫైల్ లో ఏముంది?
1994 లో అడ్ హక్ పద్ధతిలో కొందరు ప్రొఫెసర్లు నియామకం కాగా వీరు 2003 లో గ్రేడ్ స్కెల్ పొందారు. అయితే అప్పటి వీరి నియామకం సెలెక్షన్ కమిటీ ఆమోదం పొందలేదు. అటువంటి నియామకాన్ని కొత్త సర్వీసులో కలుపడానికి 1999 లో వెలువడిన జీ.వో నెంబర్.108 అనుమతించదు. జీవో కు విరుద్ధముగా పాత సర్వీసు కలుపుకోవడానికి అప్పట్లో రిజిస్ట్రార్ ప్రభుత్వానికి వీరికి అనుకూలంగా లెటర్లు పంపగా ప్రభుత్వం కొన్ని క్లారిఫికేషన్ లను అడిగింది. మళ్ళీ ఈ క్లారిఫికేషన్ లకు రిప్లై ఇచ్చిన తర్వాత సదరు ప్రొఫెసర్లు అప్పటి బీ ఆర్.ఎస్ ప్రభుత్వం నుండి పైరవీలు చేసుకొని జీవో తెచ్చుకున్నారు. పాత సర్వీసు ను కలుపుకొని వాటి బెనిఫిట్స్ పొందేలా జీవో లో పేర్కొన్నారు. ఈ జీవో ను గత వైస్ చాన్సలర్ ప్రో. రమేష్ వున్నప్పుడు ఈసీ లో ఆమోదం కొరకు పెట్టగా ఈసీ సభ్యులైన నవీన్ మిట్టల్ ఆ జీవో ఆమోదం కొరకు ఒప్పుకోలేదు. జీవో లో స్పష్టత లేదని, ఎటువంటి బెనిఫిట్స్ ఇవ్వాలో జీవో లో పేర్కొనలేదని జీవో ను మాడిఫై చేసుకొని వస్తె ఆమోదం విషయం ఆలోచిస్తామని ఆ ఈసీ మీటింగ్ లో ఈ అంశాన్ని ఆమోదించలేదు. అయితే ప్రస్తుతం ఈ విషయాన్ని ప్రస్తావనకు తీసుకురాకుండా వీరి కి ఎలాగైనా పాత పెన్షన్ అమలు ఆయ్యెట్టు ప్రస్తుత రిజిస్ట్రార్ ప్రో. మళ్ళా రెడ్డి తో ఈ ప్రొఫెసర్లు మంతనాలు జరిపి ఈసీ లో ఆమోదం కొరకు ప్రయత్నాలు మొదలు పెట్టారని సమాచారం. అయితే ఈ ప్రొఫెసర్లు లో ముగ్గురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కావడం విశేషం.
2010 లో ప్రభుత్వం నుండి ఫిజిక్స్ విభాగానికి చెందిన ప్రో. వెంకట్ రాం రెడ్డి పాత సర్వీసును కలుపుకునేలా జీవో తెచ్చుకున్నారు. దీనితో గతంలో ఆంగ్ల విభాగానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ రేణుక లోకాయుక్తను ఆశ్రయించారు. సెలెక్షన్ కమిటీ అప్రూవల్ లేకుండా జరిగిన సర్వీసును పాత సర్వీసులో కల్పుకోవడం ప్రభుత్వ జీవో కు విరుద్ధం అని లోకాయుక్త కు ఫిర్యాదు చేశారు. 2010 లో వచ్చిన జీవో ఆధారంగా మిగితా ప్రొఫెసర్లు కూడా ఎవరికీ వారు ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇచ్చి జీవో తెచ్చుకున్నారని సమాచారం.
ఈసీ బై సర్కులేషన్ లో ఆంతర్యం ఏమిటీ….?
గతంలో వీసీ రమేష్ ముఖ్యమైన నిర్ణయాలను కూడా చర్చలకు తావివ్వకుండా ఈసీ లో బై సర్కులేషన్ లో పెట్టీ ఆమోదం పొందగా మళ్ళీ ఇదే తంతుకు ప్రస్తుత రిజిస్ట్రార్ మళ్ళా రెడ్డి పాల్పడుతున్నాడని విమర్శలు వస్తున్నాయి. పాత పెన్షన్ పొందే ఫైల్ ను ఆమోదించే విషయంలో చర్చ జరగాల్స్ వుండగా చర్చకు తావివ్వకుండా బై సర్కులేషన్ లో ఈసీ పెట్టడంలో ఆంతర్యం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. సమాజానికి మార్గ దర్శనం చేసే ప్రొఫెసర్లు ఇటువంటి అక్రమ మార్గాలను ఎన్నువోవడం సిగ్గుచేటని వీరిని కఠినంగా శిక్షించాలని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.
అక్రమ పెన్షన్ పై విచారణ కమిటీ చేయాలి…..
తప్పుడు సమాచారంతో అధికారులను తప్పు దోవ పట్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని కొందరు ప్రిన్సిపాల్ సెక్రటరీ, వీసీ వాకాటి కరుణకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. సెలెక్షన్ కమిటీ అప్రూవల్ లేకుండా జరిగిన నియామకం ద్వారా చేసిన సర్వీసును కొత్త సర్వీసులో కలుపుకొని ప్రమోషన్ బెనిఫిట్స్ మరియు పాత పెన్షన్ స్కీమ్ లోకి ప్రవేశించడానికి కొందరు కుట్రలు పన్నుతున్నారని ఇటీవల కొందరు ప్రిన్సిపాల్ సెక్రటరీ కి, వీసీ వాకాటి కరుణ దృష్టికి తీసుకువెళ్లగా విషయం బయట పడింది. వీరిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.












Leave a Reply