ధర్మం కోసం ప్రాణత్యాగం చేసిన బాల వీరులే నేటి తరానికి స్ఫూర్తి – బల్బీర్ సింగ్ ఖల్సా గ్రంధి గురుద్వారా సాహెబ్
కాకతీయ యూనివర్సిటీ గోల్డెన్ జూబిలీ ఉత్సవాల్లో భాగంగా కాకతీయ యూనివర్సిటీ డీన్, స్టూడెంట్ ఎఫైర్స్ మరియు సోషలజీ, సోషల్ వర్క్ విభాగం ఆధ్వర్యంలో శనివారం సెనేట్ హాల్ లో వీర్ బాల్ దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులలో జాతీయ చైతన్యం, ధర్మ నిష్ఠను పెంపొందించేందుకు “వీర్ బాల్ దివస్ – జాతి నిర్మాణం” అనే అంశంపై వక్తృత్వ మరియు వ్యాస రచన పోటీలు నిర్వహించబడ్డాయి.
ధర్మం కోసం ప్రాణత్యాగం చేసిన బాల వీరులు….– బల్బీర్ సింగ్, ఖల్సా గ్రంధి గురుద్వారా సాహెబ్
ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా వచ్చేసిన బల్బీర్ సింగ్ ఖల్సా గ్రంధి గురుద్వారా సాహెబ్ కీలకోపన్యాసం చేస్తూ…. “ముస్లిం పాలకులైన మొఘలుల అరాచక పరిపాలనను ఎదిరించి ప్రాణత్యాగానికి వెనుకాడని ఐదు సంవత్సరాల ఫతే సింగ్, ఏడు సంవత్సరాల జొరావర్ సింగ్ వీరగాథను నేటి తరాలు స్మరించుకునేందుకే ప్రతి ఏటా వీర్ బాల్ దివస్ జరుపుకుంటున్నామనీ అన్నారు. చిన్నపిల్లలు అయినా సరే తండ్రి, అన్నల బాటలో దేశం కోసం, ధర్మం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా సమర్పించిన వీర పుత్రులనీ వారి త్యాగాలను కొనియాడారు. మొఘలుల అరాచక పాలనను ఎదుర్కొంటూ, ఎలాంటి ప్రలోభాలకు గాని, ప్రాణ భయానికి గాని తలొగ్గకుండా ధర్మాన్ని కాపాడిన ఈ బాల వీరులు ప్రపంచ చరిత్రలో అపూర్వమైన ఉదాహరణ అని అన్నారు. చలికాలంలో ఆహారం లేకుండా బంధించబడినా, ఇస్లాం స్వీకరించమని ఒత్తిడి చేసినా, వారు ధైర్యంగా “మాకు ధర్మం ప్రాణాల కంటే ప్రియమైనది” అని అన్న త్యాగ బాలలు మనందరికీ స్ఫూర్తి అని అన్నారు. చివరికి సజీవ సమాధి చేయబడ్డా, వారు చిరునవ్వుతో నిలబడి తమ ధర్మ నిష్ఠను చూపించారనీ అన్నారు.
మాట్లాడుతున్న బల్బీర్ సింగ్ ఖల్సా గ్రంథ గురు సాహెబ్
బాలల త్యాగాలు మరువలేనివి… – కేయూ వీసీ ప్రో. ప్రతాప్ రెడ్డి.
ఈ కార్యక్రమానికి కాకతీయ యూనివర్సిటీ గౌరవ ఉపకులపతి ప్రొఫెసర్ కె. ప్రతాప్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. వీసీ ప్రో ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ, వీర బాలుల త్యాగం, ధైర్యం, పరాక్రమం చరిత్రలో అజరామరంగా నిలిచిందనీ, నేటి తరాలు వీరి గాథను స్మరించుకోవడం ద్వారా ధర్మం, దేశం కోసం త్యాగం చేయాలనే స్పూర్తిని పొందాలనీ పిలుపునిచ్చారు. ప్రపంచ చరిత్రలో చిన్నపిల్లలను ఇంత నిర్దయగా అంతమొందించిన సంఘటన మరొకటి లేదనీ, అదే విధంగా ఈ వీర బాలురు చూపిన అపూర్వ సాహసం ప్రపంచంలో మరే దేశ చరిత్రలోనూ కనపడదనీ అన్నారు.

మాట్లాడుతున్న ప్రొ. కే, ప్రతాప్ రెడ్డి, వైస్ చాన్సలర్, కాకతీయ విశ్వవిద్యాలయం
ప్రొఫెసర్ వి. రామచంద్రం, రిజిస్ట్రార్, కాకతీయ విశ్వవిద్యాలయం, విశిష్ట అతిథిగా, డాక్టర్ మమతా, ఇన్చార్జ్ ప్రిన్సిపల్ యూనివర్సిటీ కాలేజీ, గౌరవ అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమాన్ని డాక్టర్ ఎం. స్వర్ణలత, హెడ్, సోషలజీ & సోషల్ వర్క్ విభాగం మరియు ప్రొఫెసర్ మామిడాల ఇస్తారి, డీన్, స్టూడెంట్ ఎఫైర్స్, గారి సమన్వయంతో విజయవంతంగా నిర్వహించారు. డా స్వర్ణలత, ప్రో మామిడాల ఇస్తారీ మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో భాగంగా 136 మంది వివిధ కాలేజీల విద్యార్థులు వ్యాస రచన, వక్తృత్వ పోటీల కొరకు రిజిస్ట్రేషన్ చేసుకొని పాల్గొన్నారని అన్నారు. వక్తృత్వ, వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు వీసీ ప్రో ప్రతాప్ రెడ్డి బహుమతులు అంద చేశారు.
విజేతలు వీరే….
వ్యాస రచన పోటీలలో మొదటి బహుమతి వృక్ష శాస్త్ర విభాగ విద్యార్థిని వెన్నెల నాయక్, సోశాలజీ, సోషల్ వర్క్ విభాగానికి చెందిన శ్రీజ భవాని లు సాదించగా, రసాయన శాస్త్ర విభాగానికి చెందిన కొండం శ్రీజ, వృక్ష శాస్త్ర విభాగానికి చెందిన మంగలి ఉషా రాణి రెండవ బహుమతి సాదించారు.
పొలిటికల్ సైన్స్ విభాగానికి చెందిన వాంఖడే ప్రతీక్, లా కాలేజీకి చెందిన రాచెర్ల తేజస్వి వక్తృత్వ పోటీలలో మొదటి బహుమతి సాదించారు. ఆంగ్ల విభాగానికి చెందిన స్టీఫన్ సిద్ధంకి, సోశాలజీ, సోషల్ వర్క్ విభాగానికి చెందిన మామిడాల అశ్విత లు వక్తృత్వ పోటీలలో రెండవ బహుమతి సాధించారు.
మొదటి బహుమతి పొందిన వారికి మెడల్, స్వామీ వివేకానంద పుస్తకాల సెట్, సర్టిఫికేట్, అదేవిధంగా రెండవ బహుమతి పొందిన వారికి అబ్దుల్ కలాం వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తకం, సర్టిఫికేట్ లను కేయూ వీసీ ప్రో ప్రతాప్ రెడ్డి, ముఖ్య అతిథి బల్బీర్ సింగ్, డీన్ స్టూడెంట్ అఫైర్స్ ప్రో మామిడాల ఇస్తారి లు కలిసి అందించి అభినందించారు.

పాల్గొన్న విద్యార్థులు
బల్బీర్ సింగ్ కు సన్మానం….
అనంతరం కేయూ వీసీ ప్రో ప్రతాప్ రెడ్డి, రిజిస్ట్రార్ ప్రో.వి.రామచంద్రం, డీన్ స్టూడెంట్ అఫైర్స్ ప్రో.మామిడాల ఇస్తారి, ప్రో స్వర్ణలత లు కలిసి ముఖ్య వక్తగా వచ్చేసి కీలకోపన్యాసం చేసిన బల్బీర్ సింగ్ ఖల్సా గ్రంధి గురుద్వారా సాహెబ్ ను శాలువా, మెమెంటోలతో సత్కరించారు.

బల్బీర్ సింగ్ ఖల్సా గ్రంధి గురుద్వారా సాహెబ్ ను సన్మానిస్తున్న కేయూ వీసీ ప్రో ప్రతాప్ రెడ్డి, రిజిస్ట్రార్ ప్రో రామచంద్రం














Leave a Reply