తెలుగు రాష్ట్రాల్లో కంపించిన భూమి….
జోర్దార్ ప్రతినిధి:
బుధవారం ఉదయం 7.29 గంటలకు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని స్థలాల్లో స్వల్ప భూకంపం వచ్చినట్లు వార్తలు వచ్చాయి. కొత్తగూడెం, భద్రాచలం, నాగుల వంచ, మణుగూరు తదితర ప్రాంతాలతో బాటు అనేక చోట్ల 5-10 సెకన్ల కాలం భూమి కంపించింది. రంగశాయి పేటలో కూడా ఒక ఐదు సెకన్ల పాటు భూమి కంపించిందని చెబుతున్నారు.
కాకతీయ యూనివర్సిటీలో కంపించిన భూమి….
భయంతో విద్యార్థులు పరుగులు…
కాకతీయ యూనివర్సిటీలో కూడా అదే సమయానికి పలు చోట్ల కొన్ని సెకన్ల పాటు భూమి కంపించిందని విద్యార్థులు చెబుతున్నారు. స్కాలర్స్ హాస్టల్ ఇంకా మిగితా కొన్ని హాస్టల్స్ లలో గదుల్లో నున్న బెడ్ కు కదిలినట్లు విద్యార్థులు చెబుతున్నారు. భయంతో విద్యార్థులు బయటకు పరుగులు తీసినట్లు చెబుతున్నారు.
















Leave a Reply