కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళి
ఆదిలాబాద్, సెప్టెంబర్ 21 జోర్దార్ ప్రతినిధి
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 14వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో బాపూజీ పోషించిన కీలక పాత్రను నాయకులు కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేంద్ర మంత్రి పదవిని సైతం త్యాగం చేసి ఉద్యమానికి అండగా నిలిచారని గుర్తుచేశారు.బాపూజీ ఆశయాల సాధనకు ప్రభుత్వం కృషి చేయాలని, ఆదిలాబాద్ జిల్లాలో నిర్మించనున్న కొత్త విమానాశ్రయానికి ఆయన పేరు పెట్టాలని నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో మంచిగట్ల ఆశమ్మ, మమీడాల దశరథ్ ,జక్కుల సత్యనారాయణ,బేత రమేష్,కుర్ర రవీందర్, అనుముల ఊశన్న,కోక్కుల ఆడేళ్లు తదితరులు పాల్గొన్నారు.












Leave a Reply