విలేకరిపై దాడిని ఖండించిన టి డబ్ల్యూ జె యప్ జిల్లా అధ్యక్షుడు

విలేకరిపై దాడిని ఖండించిన 

టి డబ్ల్యూ జె యప్ జిల్లా అధ్యక్షుడు

జోగులాంబ గద్వాల జోర్దార్ ప్రతినిధి | సెప్టెంబర్ 23

విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న విలేకరి నర్సింహులుపై ఇద్దరు యువకులు దాడి చేయడాన్ని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు బి. గిరిబాబు తీవ్రంగా ఖండించారు. మంగళవారం రాత్రి ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద నర్సింహులుపై దాడి జరగగా, గాయపడిన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని గిరిబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఉదయం 10.30 గంటలకు మీడియా ప్రతినిధులు ఎంపీడీవో కార్యాలయం వద్దకు చేరుకోవాలని, అనంతరం జిల్లా ఎస్పీకి వినతిపత్రం సమర్పించనున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *