పాఠశాలలో మొక్కను నాటిన పూర్వ విద్యార్థి
హనుమకొండ జోర్దార్ ప్రతినిధి
హనుమకొండ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థిని కూరాకుల భారతి తన పుట్టినరోజు సందర్భంగా పాఠశాలలో మొక్కను నాటారు. ఆమె కడారి సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాఠశాల ప్రాంగణంలో సిబ్బందితో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 1975 లో ఈ పాఠశాలలో ఎస్ఎస్సి చదివిన భారతి అనంతరం ఉన్నతమైన చదువుతో ఉన్నత ఉద్యోగం నిర్వహించి ఉద్యోగ విరమణ అనంతరం సేవా దృక్పథంతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కార్మిక శాఖలో గ్రేడ్ వన్ అధికారిగా, ఎన్సీఎల్పీ ప్రాజెక్టు డైరెక్టర్ గా పనిచేసి రిటైర్ అయిన అనంతరం 68 ఏళ్ల వయసులో తనకు ఫౌండేషన్ విద్యను ప్రసాదించిన పాఠశాలలో పుట్టినరోజు జ్ఞాపకంగా మొక్కను నాటి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈమె చదువుతోపాటు క్రీడల్లో సైతం రాణించి మంచి గుర్తింపు పొందారు. భారతి ఉమ్మడి రాష్ట్రంలో షటిల్, స్విమ్మింగ్, టెన్నికాయిట్ లలో ఛాంపియన్, 18సార్లు జాతీయ స్థాయిలో, మూడుసార్లు అంతర్జాతీయ స్థాయిలో విజేత గా నిలిచారు.
తనకు విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాలను మర్చిపోకుండా పుట్టినరోజు ఉపాధ్యాయులు, విద్యార్థుల సమక్షంలో జరుపుకోవడం ఆనందంగా ఉందని ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం శ్రీమతి ఉమా, ఉపాధ్యాయులు రాజ్ కుమార్ తోపాటు కడారి సేవా ఫౌండేషన్
సంస్థ ప్రెసిడెంట్ కె. శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి భారతి, ఉపాధ్షాక్షురాలు విజయకుమారి, మాధవి, పద్మావతి తదితరులు పాల్గొన్నారు.









Leave a Reply