*ఎస్ ఐ ఆర్ (సర్) ప్రక్రియను రద్దు చేయాలి*
*సిఇసి జ్ఞానేశ్ కుమార్ ను పదవి నుండి వెంటనే తొలగించాలి*
*ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ర్యాలీ నిరసన ప్రదర్శన*
హనుమకొండ జోర్దార్ ప్రతినిధి
ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ హనుమకొండ మరియు వరంగల్ జిల్లాల ఆధ్వర్యంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాళోజీ సెంటర్ నుండి హనుమకొండ కలెక్టరేట్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శన నిర్వహించడం జరిగింది.

ర్యాలీ మరియు నిరసన ప్రదర్శనలకు ముఖ్య అతిథులుగా హాజరైన యుఎస్పిసి రాష్ట్ర స్టీరింగ్ కమిటీ నాయకులు నన్నెబోయిన తిరుపతి, టి.లింగారెడ్డిలు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతం కలిగించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను(సర్) వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎలక్షన్ కమిషన్ లో మెజార్టీ సభ్యుల అంగీకారం లేకుండా సర్ ప్రక్రియ అమలకు ముఖ్య కారకులైన ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ ను పదవి నుండి వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.ఎన్నికల కమిషనర్ల నియామకాన్ని ఏకపక్షం చేస్తూ 2023లో చేసిన చట్టాన్ని రద్దు చేయాలని కోరారు. దేశంలో ఉన్న ప్రతి పౌరునికి రాజ్యాంగ నిబంధనల మేరకు ఓటు హక్కు కల్పించాలన్నారు. సర్ ప్రక్రియ ద్వారా 13 కోట్ల పౌరుల ఓట్లు తొలగించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు లాంటిదని అన్నారు.మరణించిన ఓటర్లను, డబుల్ ఓట్లను తొలగించడంలో ఎవరికీ అభ్యంతరం లేదన్నారు. కాని బతికున్న వారిని వివిధ అసంబద్ధ కారణాలతో ఓటుహక్కును నిరాకరించడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. ఓటర్లు పాలకులను ఎన్నుకునే స్థితి నుండి పాలకులే తమకు అనుకూలురైన వారిని ఓటర్లుగా ఎంపిక చేసుకునే దుస్థితి వచ్చిందన్నారు.దేశంలో ఓటు ఉన్నవారు,ఓటు లేనివారు అని రెండు రకాల పౌరులను సర్ ప్రక్రియ తయారు చేస్తుందన్నారు. ఎలక్షన్ కమిషన్ దురాగతాలను ఎండగడుతూ విద్యార్థులు, యువత నిర్వహిస్తున్న ఉద్యమాలను కేంద్ర ప్రభుత్వం అణిచివేయడం అప్రజాస్వామిక చర్య అన్నారు. సర్ ప్రక్రియ రద్దు అయ్యే వరకు ప్రజలు ఐక్యతతో ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

ఈ ర్యాలీ నిరసన ప్రదర్శనలో అధ్యాపకజ్వాల ప్రధాన సంపాదకులు డాక్టర్ ఎం. గంగాధర్, టిపిటిఎఫ్, డిటిఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యులు రావుల రమేష్, అటుకుల శ్రీనివాస్ రెడ్డి, డిటిఎఫ్ సీనియర్ సభ్యులు నోముల శ్రీనివాస్ రెడ్డి, హనుమకొండ మరియు వరంగల్ జిల్లాల యూఎస్పిసి నాయకులు పెండెం రాజు ,గాదరి ఉప్పలయ్య, కట్కూరి శ్రీనివాస్, ఈ.కుమారస్వామి, ఎ.గోవిందరావు, సి.హెచ్ లక్ష్మయ్య ,సృజన కుమార్, ములుగు, భూపాల పల్లి జిల్లా నాయకులు జి.ఆదిరెడ్డి, టి.సుదర్శనం,కె. నరసింహులు, కె. దేవదాస్,సి.హెచ్.శ్రీలత, ఎ.సత్యమ్మ,ఎస్.అనిత, ఎస్.సుమ, ఆర్.రామ్ రెడ్డి, ఎ.మల్లయ్య, జి.రమేష్ , ఉస్మాన్,చందర్ నాయక్,ఎ. ఆనందాచారి, చంద్రమౌళి, హరిశంకర్, వీరభద్రం, టి.రఘువీర్, కె.సమ్మిరెడ్డి,ఉమా శంకర్, తదితరులు పాల్గొన్నారు.








Leave a Reply