సర్ ప్రక్రియకు వ్యతిరేకంగా ఉపాధ్యాయ సంఘాల నిరసన ర్యాలీ

*కరీంనగర్ లో ‘సర్’ కు వ్యతిరేకంగా యూఎస్పీసీ నిరసన ర్యాలీ*

కరీంనగర్ జోర్దార్ ప్రతినిధి

సి ఈ సి జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, 2023 ఎలక్షన్ చట్టం రద్దు చేయాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక యుఎస్పిసి ఆధ్వర్యంలో నేడు కరీంనగర్ లో నిరసన ర్యాలీ చేపట్టారు.
ఈ సందర్భంగా యుఎస్పిసి నాయకులు మాట్లాడుతూ..కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ ఏకపక్షంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ఓటర్ల సవరణ చేపట్టిన కారణంగా దేశవ్యాప్తంగా పదమూడున్నర కోట్ల ఓటర్లను ఓటర్ లిస్ట్ ల నుండి తొలగించడం జరిగిందని, ఈ ఓట్లలో ఎక్కువ భాగం మైనార్టీలు,దళితులు,ఆదివాసీలు, బహుజన సమూహాలే ఎక్కువ అని పేర్కొన్నారు. ‘సర్’ ప్రక్రియ రాజ్యాంగ వ్యతిరేకమైనదే కాకుండా కేంద్రంలోని ప్రభుత్వానికి శాశ్వత అధికారాన్ని కల్పించే దిశగా చేపట్టిన కార్యక్రమంగా తెలిపారు. ఈ క్రమంలో ఇతర ఎన్నికల కమిషనర్ల అభిప్రాయాన్ని పరిగణన లోకి తీసుకోకుండా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న జ్ఞానేశ్ కుమార్ పదవి నుండి వైదొలగాలని,’సర్’ ప్రక్రియను నిలిపివేయాలని, 2023లో ఎన్నికల కమిషనర్ల నియామకానికి చేసిన సవరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో డిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మరియు యూఎస్పిసి స్టీరింగ్ కమిటీ సభ్యుడు వైద్యుల రాజిరెడ్డి , డిటిఎఫ్ కరీంనగర్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి లు అవాల నరహరి, చకినాల రామ్మోహన్, రాష్ట్ర కౌన్సిలర్ నారాయణరెడ్డి , తూముల తిరుపతి,వీణవంక అధ్యక్షుడు కనకం శ్రీనివాస్, సీనియర్ కార్యకర్తలు రవీంద్ర కుమార్, వెంకటేశ్వరరావు, హరీష్ కుమార్ చంద్రశేఖర్ రెడ్డి, రజాక్, వెంకటేశ్వర్ రెడ్డి, దేవరాజు, లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *