కేయూ లో సస్పెన్షన్ ఉత్తర్వులు బేకాతర్

ఆర్ట్స్ కాలేజీ అధ్యాపకుడి సస్పెన్షన్….

  • మళ్ళీ విధుల్లోకి తీసుకునేందుకు ఏర్పాట్లు పూర్తి….
  • సస్పెన్షన్ ఆర్డర్ ఉల్లంఘనలు….

6 అక్టోబర్ 2026, జోర్డార్ వరంగల్ ప్రతినిధి:

కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ కార్యాలయం, యూనివర్సిటీ ఆర్ట్స్ & సైన్స్ కళాశాల, సుబేదారిలోని తెలుగు విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ (కాంట్రాక్ట్)గా పనిచేస్తున్న డా. ఎం. శంకరయ్యను వెంటనే అమలులోకి వచ్చేలా సస్పెండ్ చేస్తూ విశ్వవిద్యాలయం ఉత్తర్వులు (నం. 969/A2/KU/2026) జారీ చేసింది.

సస్పెండ్ ఎందుకు?..

2011-2013 సంవత్సరాల మధ్య కాలంలో డా. శంకరయ్య, పోస్ట్-డాక్టోరల్ ఫెలోషిప్ పొందుతూనే, అదే సమయంలో పార్ట్ టైమ్/కాంట్రాక్ట్ బోధన రెమ్యునరేషన్ కూడా తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై విచారణ కమిటీ నివేదికను పరిశీలించిన తర్వాత, యూజీసీ నిబంధనల ఉల్లంఘనగా గుర్తించి, అప్పటికే తీసుకున్న మొత్తం ఫెలోషిప్ నిధులను (రూ. 6,89,400/-) యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కు తిరిగి చెల్లించాలని విశ్వవిద్యాలయం ఆదేశించింది.

యూజీసీని తప్పు దారి పట్టించిన అధ్యాపకుడు….

అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు, డా. శంకరయ్య ₹2,00,000 మాత్రమే పాక్షికంగా చెల్లించారు. మిగిలిన బకాయి మొత్తాన్ని 10 వాయిదాలలో చెల్లించేందుకు అనుమతించాలని ఆయన అభ్యర్థించారు. అయితే, పది నెలలుగా సంపూర్ణ మొత్తాన్ని చెల్లించడంలో ఆయన విఫలమవడం, అధికారిక ఆదేశాలను పదేపదే ఉల్లంఘించడం, ఒప్పంద నిబంధనలను భంగం చేయడం వంటి కారణాల వల్ల ఆయన సేవలను కొనసాగించడం సరికాదని విశ్వవిద్యాలయం భావించింది. ఈ నేపథ్యంలో, యూజీసీ నిబంధనల ఉల్లంఘన మరియు అధికారుల ఆదేశాలను పట్టించుకోకపోవడం వంటి తీవ్ర అంశాలపై డా. ఎం. శంకరయ్యను వెంటనే సస్పెండ్ చేస్తూ, ఆర్ట్స్ కాలేజీ సుబేదారి ప్రిన్సిపాల్తో ఆయన చేసిన కాంట్రాక్ట్ బాండ్ ను నిలిపివేస్తూ రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం పీడీఎఫ్ నిధులను తిరిగి చెల్లించి, పీడీఎఫ్ ఉపసంహరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ ఉత్తర్వుల ప్రతులను యూజీసీ కార్యదర్శి (న్యూఢిల్లీ), ప్రిన్సిపాల్ (ఆర్ట్స్ కాలేజీ సుబేదారి), యూజీసీ కోఆర్డినేటింగ్ అధికారి తదితరులకు పంపించినట్లు విశ్వవిద్యాలయం వెలువరించిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

సస్పెన్షన్ ఆర్డర్ ఉల్లంఘనలు….

యూజీసీని తప్పు దారి పట్టించి తీసుకున్న ఫెలోషిప్ డబ్బులను తిరిగి చెల్లిస్తే సస్పెన్షన్ ఎత్తివేస్తామనే లోపాయికారి ఒప్పందాన్ని కొందరు అధికారులు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. పీడీఎఫ్ ఉపసంహరణ ప్రక్రియ పూర్తి అయ్యే వరకు సస్పెన్షన్ ఎత్తివేయబడదని రిజిస్ట్రార్ ఉత్తర్వుల్లో ఉన్నప్పటికీ సస్పెన్షన్ ను ఎత్తివేసి ఉద్యోగంలోకి తీసుకునే విధంగా కొందరు ప్రయత్నాలు చేస్తున్నట్లు యూనివర్సిటీలో చర్చ జరుగుతుంది. సస్పెన్షన్ ఉత్తర్వుల ప్రకారం పీడీఎఫ్ ఉపసంహరణ ప్రక్రియ పూర్తవ్వాలి. దీని కొరకు తీసుకున్న చర్యలను యూజీసీ, ఢిల్లీ అధికారులకు యూనీవర్సిటీ రిజిస్ట్రార్ పంపాల్సి ఉంది. ఆ తర్వాత యూజీసీ తీసుకొనే నిర్ణయం మేరకు కేయూ అధికారులు పని చేయాల్సి ఉంది. తీసుకున్న చర్యలను యూజీసీ కు ప.పాలని యూజీసీ రిమైండర్లను పంపినా కూడా కేయూ అధికారులు మాత్రం అవినీతి పరులను ప్రోత్సహిస్తూ కేయూ ను అవినీతికి అడ్డాగా మారుస్తున్నారని విమర్శలు విద్యార్థ సంఘాలు చేస్తున్నాయి. యూజీసీ తీసుకునే చర్యలు వరకు చూడకుండా సస్పెన్షన్ ఎత్తివేయడం నిబంధనల ఉల్లంఘనల కిందకు వస్తుందని దీనిపై యూజీసీ కు, రాష్ట్ర ప్రభుత్వం విద్యా శాఖా ప్రిన్సిపాల్ సెక్రెటరీ కి విద్యార్థి సంఘాలు పిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం ఉంది.

రాత్రికి రాత్రే సస్పెన్షన్ ఉత్తర్వులను రద్దు చేస్తున్నారా ….?..

ఈరోజు అనగా అక్టోబర్ 6 మంగళవారం రాత్రి వరకు కేయూ వీసీ, రిజిస్ట్రార్ లు కలిసి సస్పెన్షన్ ఉత్తర్వులను రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఇక ఇటువంటి నిర్ణయాలతో కేయూ లో అవినీతి రాచబాట కాబోతుందనే సంకేతాలు బయటకు వస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *