లో-వోల్టేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం
*30 లక్షలతో నాలుగు డీటీఆర్‌ల ఏర్పాటు…
రాయికల్, సెప్టెంబర్ 19, జోర్దార్ ప్రతినిధి:
రాయికల్ పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న లో-వోల్టేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రూ.30 లక్షల వ్యయంతో నాలుగు డీటీఆర్‌లను ఏర్పాటు చేసినట్లు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ తెలిపారు. గృహజ్యోతి పథకం కింద రాయికల్ మండలానికి సుమారు రూ.11.70 కోట్ల నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు.ఇందిరమ్మ ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు, పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా నిరంతర సరఫరా కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. రాయికల్ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని, మైతాపూర్–రామాజీపేట బ్రిడ్జి పనులు పూర్తయ్యాయని తెలిపారు. పెండింగ్ బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకుంటూ కొత్త అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, సర్పంచులు, నాయకులు, విద్యుత్ అధికారులు పాల్గొన్నారు.















Leave a Reply