అసలు సూత్ర దారులెవరు…?

  • అసలు సూత్ర దారులెవరు…?
  • రన్నింగ్ రోస్టర్ మతలబు ఏమిటి…?
  • ఎస్టీ పోస్టు నింపకపోవడానికి కారణం ఏమిటీ…?
  • మళ్ళీ ఇంటర్వ్యూలకు పిలుస్తారా..?

సెప్టెంబర్ 30, జోర్దార్ వరంగల్ ప్రతినిధి: 

కాకతీయ యూనివర్సిటీలో పార్ట్ టైం అధ్యాపకుల నియామకంలో అవకతవకలు జరిగాయని ఫలితాలు వెల్లడించిన రోజున బంజారా విద్యార్థి సంఘ నాయకులు వీసీ, రిజిస్ట్రార్ లను కలిసి మాట్లాడిన విషయం విదితమే. ఎస్టీ కేటగిరీలో రెండు ఖాళీలు ఉండగా ముగ్గురు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా ఒక్కరికే సెలెక్ట్ చేసి మరొక ఎస్టీ పోస్టు ఎందుకు భర్తీ చేయలేదని కేయూ రిజిస్ట్రార్ ప్రో. రామచంద్రం ను విద్యార్థి సంఘ నాయకులు అప్పట్లో నిలదీసినప్పటికీ ఇప్పటి వరకు ఆ నియామకంపై ఎటువంటి స్పందన లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని విద్యార్థి సంఘాలు అంటున్నాయి.

రన్నింగ్ రోస్టర్ మతలబు ఏమిటి…?

నోటిఫికేషన్ లో ప్రతి విభాగంలో రన్నింగ్ రోస్టర్ లో ఒకే కేటగిరీ పెట్టడంతో చాలా విభాగాల్లో ఆ తర్వాత వచ్చే రన్నింగ్ రోస్టర్ కేటగిరీకి చెందిన వాళ్ళు దరఖాస్తు చేసుకోలేకపోయారని అభ్యర్థులు అంటున్నారు. బ్యాక్ లాగ్ కేటగిరీలో నోటిఫికేషన్ లో చూపించిన అన్ని కేటగిరీల వాళ్ళు దరఖాస్తు చేసుకున్నా కానీ అందరినీ ఇంటర్వ్యూలకు పిలుసుకోవడంలో మతలబు ఏమిటి కూడా విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. రన్నింగ్ రోస్టర్ పేరు మీద తనకు తెలిసిన ఇష్టమైన అభ్యర్థులకు సమాచారం ఇచ్చి దరఖాస్తు చేయించారని కూడా విద్యార్గి సంఘాలు విమర్శిస్తున్నాయి.

ఎస్టీ పోస్టు నింపకపోవడానికి కారణం ఏమిటీ…?

రెండు ఎస్టీ కేటగిరీ ఖాళీలలో ముగ్గురు అభ్యర్థులు అర్హులుగా ఉన్నప్పటికీ రెండు భర్తీ చేయాల్సింది పోయి కేవలం ఒక్కటే భర్తీ చేయడంలో మతలబు ఏమిటని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. మళ్ళీ ఇద్దరు అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారా…? మార్కులు మళ్ళీ వేస్తారా…? అనే సందేహాలు వర్సిటీలో చర్చనీయాంశం అయ్యాయి. అయితే కమిటీలో కేయూ ముఖ్యమైన పాలన అధికారి ఓ.ఎస్.డీ ఉన్నప్పటికీ ఇటువంటి వివాదం రావడంతో దీని వెనుక అసలు సూత్రం దారులు ఎవరన్నది తేలాల్సి వుంది.

ఈ విషయంపై జోర్ధార్ ప్రతినిధి కేయూ రిజిస్ట్రార్ ప్రో. రామచంద్రం ను వివరణ కోరగా ఆయన ఫిజిక్స్ విభాగంలో ఎటువంటి అవకతవకలు జరగలేదని వివరణ ఇచ్చారు.

ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో అవకతవకలు జరగలేదు…
– ప్రో. రామచంద్రం, కేయూ రిజిస్ట్రార్.

ఫిజిక్స్‌లో మొత్తం ఖాళీలు ఎనిమిది. దాంట్లో బ్యాక్ లాక్స్ 6 పోస్టులు. రిజర్వేషన్ వైజు గా చూసినప్పుడు బీసీఏ 1 ,బిసిబి ఒకటి ,బీసీసీ ఒకటి, ఎస్టీ రెండు ,ఎస్సీ గ్రూప్-3 ఒకటి, ఈ టోటల్ బ్యాక్‌లాగ్స్ వచ్చేసి ఆరు . ఫిజిక్స్‌లో టోటల్ వేకెన్సీస్ ఉన్నవి ఎనిమిది. కాబట్టి లాస్ట్ డిపార్ట్మెంట్ రోస్టర్ 26 దగ్గర కట్ అయిపోయింది. మనకు నెక్స్ట్ వచ్చే రెండు రన్నింగ్ పోస్టర్ పాయింట్లు ఏంటంటే 27 ( s c గ్రూప్ 2) 28 (EWS ) . మనకు బ్యాక్లాగ్ ఆరు పోస్టులు ఉన్నాయి. కాబట్టి 6ఆరు ఫీల్ చేసిన తర్వాత, రన్నింగ్ రోస్టర్ 27 28 కి వస్తాది. నోటిఫికేషన్ లో కూడా నోట్ పెట్టి రన్నింగ్ రోస్టర్ ఫాలోస్ అని పెట్టారు. మిగతా డిపార్ట్మెంట్లలో కూడా ఇదే విధముగా రన్నింగ్ రోస్టర్ లో పోస్ట్‌లు ఫిల్ చేయడం జరిగింది.

ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టును నింపకుండా ఈ.డెబ్యూ.ఎస్ ఎలా నింపుతారు…?

– డా.గుగులోతు రాజ్ నాయక్, ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు

ఈ.డెబ్యూ.ఎస్ కేటగిరీని నోటిఫికేషన్ లో మెన్షన్ చేయనందువలన చాలా మంది చాలా విభాగాల్లో దరఖాస్తు చేసుకోలేదు. నోటిఫికేషన్ లో 8 ఖాళీలు నింపాలని ప్రకటించి ఐదు మాత్రమే నింపి అందులో ఎస్టీ బ్యాక్ లాగ్ ను నింపకుండా రన్నింగ్ రోస్టర్ కు ఎలా వెళ్తారు. ఈ.డెబ్యూ.ఎస్ ను మాత్రమే నింపి మిగతా రన్నింగ్ రోస్టర్ వాళ్లను ఎందుకు అని విభాగాల్లో ఇంటర్వ్యూలకు పిలువలేదు. కొన్ని విభాగాల్లో బ్యాక్ లాగ్ లో అప్లై చేసుకున్న వారిని కూడా ఇంటర్వ్యూలకు పిలువలేదు. ఎస్టీ పోస్టు నింపేదాకా ఉద్యమం కొనసాగిస్తాం. ఎస్టీ కమీషన్ ను ఆశ్రయిస్తాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *